ఇంగ్లీష్ భాష మాట్లాడడం నేర్చుకోవాలంటే ముందుగా ఇంగ్లీష్ భాషలో ఉన్న పదాలకు (మాతృ భాష) తెలుగు భాషలో అర్ధాలు తెలుసుకోవాలి. తర్వాత తెలుగు భాషలోని వాక్యాలను మనసులో అనుకోని దానిని ఇంగ్లీష్ భాష లోకి తర్జుమా చేయాలి.
భాష రెండు విధాలుగా ఉంటుంది
1. వాడుక భాష.. అంటే చదువురాని వారు వ్యవహారికముగా మాటల్లాడేది.
2. గ్రాంధిక భాష అంటే గ్రంధములో ఉండి చదువుకున్న భాష.
భాష అనగా
అక్షరాలను పదాలుగా మార్చడం,
పదాలను వాక్యాలుగా మార్చడం.
ఒక వాక్యంలో పనిచేసేవాడు (కర్త ) (Subject) ఉంటాడు, సహాయక పని(Helping Verb ) ఉంటుంది, పని (క్రియ)(Verb) ఉంటుంది.
కర్మ(Object) ఉంటుంది. ముందుగా వీటి అర్ధాలను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసుకోవాలి. తర్వాత మాట్లాడే విధానం కాలాల ప్రకారం
నేర్చుకొని భాషను తర్జుమా చేసుకుంటూ, మార్చు కుంటూ మాట్లాడుతూ ఉండాలి.
రెండు సంవత్సరాల పరిశోధన తర్వాత ఒక చిన్న నేర్చుకునే పద్ధతి కనుగొనడం జరిగింది.
ఆ పద్దతి ఏమిటంటేి ప్రతి వాక్యంలో కర్త, సహాయక క్రియ, క్రియ, కర్మ లు ఉంటాయి వాటి అర్ధాలు వేరే భాషలో నేర్చుకొని, వాటిని కాలాల ప్రకారం అమర్చితే అదే భాష అవుతుంది, దానితో మాట్లాడడం వస్తుంది.
భాష అనగా
పనిచేసేవాడి (Subject) కి ఒక పని (Verb) ఇచ్చి ఆ పనిలో ఉన్న మూడు రకాలు (Verb Forms ) చేయించడమే భాష.
ఏ భాషలో అయిన మూడు కాలాలు ఉంటాయి. అవి తెలుగు భాషలో
1. భవిష్యత్ కాలం (జరుగ బోయే పనిని తెలుపుతుంది,) ఉదా : నేను వ్రాస్తాను, మీరు వ్రాస్తారు ,
2. వర్తమాన కాలం,(జరుగుతూఉన్న పనిని తెలుపుతుంది) ఉదా : నేను వ్రాస్తూ ఉన్నాను, మీరు వ్రాస్తూ ఉన్నారు
3. భూత కాలం (జరిగి పోయిన పనిని తెలుపుతుంది) ఉదా: నేను వ్రాసాను, మీరు వ్రాసారు )
***
కాలాల ప్రకారం కర్తలను, సహాయక పనులను మరియు క్రియా రూపాలను ఉపయోగించి వాక్యాలు ఎలా తయారు చేయాలో చూద్దాం.
1. నేను వ్రాస్తాను
2. నేను చదువుతాను
3. నేను తింటాను
4. నేను త్రాగుతాను
5. నేను మాట్లాడుతాను
పై వాక్యాలలో నేను అనేది కర్త (పనిచేసేవాడు), వ్రాస్తాను, చదువుతాను, తింటాను, త్రాగుతాను, మాట్లాడుతాను ఇవన్నీ క్రియ యొక్క మొదటి రకం. ఇవి భవిషత్ కాలాన్ని తెలియ జేస్తాయి.
***
1. నేను వ్రాస్తూ ఉన్నాను
2. నేను చదువుతూ ఉన్నాను
3. నేను తింటూ ఉన్నాను
4. నేను త్రాగుతూ ఉన్నాను
5. నేను మాట్లాడుతూ ఉన్నాను
పై వాక్యాలను గమనిస్తే నేను అనే కర్త ప్రతి దాంట్లో ఉన్నాడు.
ఉన్నాను అనే సహాయక క్రియ ప్రతి దాంట్లో ఉన్నది. కానీ కేవలం క్రియా రూపాలు (పని రకాలు ) మాత్రమే మారాయి. ఇవి పనులలో రెండో రకం.
ఇవి వర్తమాన కాలాన్ని తెలియ జేస్తాయి.
***
1. నేను వ్రాసాను
2. నేను చదివాను
3. నేను తిన్నాను
4. నేను త్రాగాను
5. నేను మాట్లాడాను
పై వాక్యాలను గమనిస్తే నేను అనే కర్త (పని చేసేవాడు) ప్రతి దాంట్లో ఉన్నాడు.
కేవలం క్రియా రూపాలు మాత్రమే మారాయి. ఇవి పనులలో మూడో రకాలు. ఇవి భూత కాలాన్ని తెలియజేస్తాయి.
పై అన్ని వాక్యాలను గమనిస్తే కర్త అయిన " నేను" ప్రతి దాంట్లో ఉన్నాడు.
"ఉన్నాను" సహాయక క్రియ అనేది రెండో రకం పనిలో ప్రతి దాంట్లో ఉన్నది. కాలాలు కూడా మూడే ఉన్నాయి. కేవలం క్రియలు మరియు క్రియా రూపాలు మారుతూ ఉంటాయి.
కాబట్టి గమనించి, నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే
1. కర్తలు (పని చేసేవాళ్ళు )
2. సహాయక క్రియలు (సహాయక పనులు)
3. కాలాలు
ఈ మూడు మారవు, క్రియా రూపాలు మారుతాయి.
కాబట్టి కర్తలు, సహాయక క్రియలు, కాలాలు ఎన్ని ఉన్నాయో నేర్చుకోండి.
తర్వాత క్రియలు, క్రియా రూపాలు నేర్చుకుంటూ సాధన చేస్తూ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడం సులభంగా ఉంటుంది.
ఇంకొక ముఖ్యమైన విషయం తెలుగు భాషకు ఇంగ్లీష్ భాష వ్యత్యాసం ఏమిటంటే, తెలుగు భాష ముందు నుండి చివరకు ఉంటే, ఇంగ్లీష్ భాష చివర నుండి మొదటకు ఉంటుంది. కేవలం కర్త మాత్రమే ఎప్పుడు మొదట వస్తాడు.
ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే సులభమైన పద్ధతి చూద్దాం.
1. కర్తలు (Subjects), (సులభంగా అర్ధం కావడానికి కర్తలను పనిచేసేవాళ్లుగా మార్చామూ గమనించండి. )
2. సహాయక క్రియలు (Helping Verbs ) ( సహాయక క్రియలను అర్ధం కావడం కోసం సహాయక పనులుగా మార్చాము)
3. క్రియలు (Verbs ) ( క్రియలను అర్ధం కావడం కోసం పనులు గా మార్చాము)
4. క్రియా రూపాలు (Verb Forms) ( క్రియా రూపాలను అర్ధం కావడం కోసం పని రకాలుగా మార్చాము )
5. కాలాలు ( Tenses )
6. ప్రశ్నా పదాలు ( Question Words)
ఈ ఆరు రకాలతో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం .
గమనిక : ఇది మొదటి పద్ధతి కేవలం వాడుక భాష అని గమనించ గలరు.
గ్రాంధిక భాష మొత్తం రెండో పద్ధతిలో ఉంది.
(పని చేసేవాళ్ళు) (కర్తలు) (Subjects)
నేను = i
మేము, మనము = we
నీవు = you
మీరు. = you
అతడు, అతను. = he
ఆమె = she
ఇది = it
వారు, వాళ్ళు = they
(పని = verb)
సహాయక పనులు (helping Verbs)
ఉన్నాను = am
ఉన్నాడు = is
ఉన్నది = is
ఉంది = is
ఉన్నారు = are
ఉన్నాము = are
ఉన్నాయి = are
పనులు (verbs)
తినడం = eat
త్రాగడం = drink
వ్రాయడం = write
చదవడం = read
మాట్లాడడం = talk
వినడం = listen
చూడడం = see
ఆడడం = play
కూర్చోవడం = sit
నిలబడడం = stand
పరుగెత్తడం = run
అరవడం = shout
నడవడం = walk
చాలా పనులు ఉన్నాయి. అవి అన్ని అవసరాన్ని బట్టి నేర్చుకోవాలి.
పని రకాలు (helping verbs)
Verb 1 Verb 2 Verb 3 Verb 4
write wrote written writing
వ్రాయడం
నేను వ్రాస్తాను వ్రాసాను వ్రాసి వ్రాస్తూ
(i) (write) (wrote) (written) (writing)
మేము వ్రాస్తాము వ్రాసాము వ్రాసి వ్రాస్తూ
(we) (write) (write) (written) (writing)
నీవు వ్రాస్తావు వ్రాసావు వ్రాసి వ్రాస్తూ
(you) write wrote written writing
మీరు వ్రాస్తారు వ్రాసారు వ్రాసి వ్రాస్తూ
(you) write wrote written writing
అతడు వ్రాస్తాడు వ్రాసాడు వ్రాసి వ్రాస్తూ
he writes wrote written writing
ఆమె వ్రాస్తది వ్రాసింది వ్రాసి వ్రాస్తూ
she writes wrote written writing
ఇది వ్రాస్తది వ్రాసింది వ్రాసి వ్రాస్తూ
it writes wrote written writing
వారు వ్రాస్తారు వ్రాసారు వ్రాసి వ్రాస్తూ
they write wrote written writing
పని రకాలను గమనిస్తే ఒక పదానికి అర్ధం ఒకటి ఉంటే, ఎప్పుడైతే కర్త వస్తాడో అప్పుడు దాని అర్ధం మారుతూ ఉంది .
ఉదా : write. = వ్రాయడం అని అర్ధం. కానీ.
I write. = నేను వ్రాస్తాను, you write. = మీరు వ్రాస్తారు గా మారుతుంది గమనించ గలరు .
Verb 3 మరియు Verb 4 లను గమనిస్తే written = వ్రాసి ,
writing. = వ్రాస్తూ అని సగమే వచ్చింది. దానికి కారణం ఏమిటంటే తెలుగు భాషలో నేను వ్రాస్తున్నాను అంటే. నేను వ్రాస్తూ ఉన్నాను అని అర్ధం
వ్రాస్తున్నాను ని రెండు గా విడగొడితే గాని. ఇంగ్లీష్ భాష రాదు. అది ఎలాగంటే
నేను వ్రాస్తూ ఉన్నాను. (నేను అంటే కర్త, వ్రాస్తూ అంటే క్రియ, ఉన్నాను అంటే సహాయక పని. అని గమనించగలరు)
I writing am (ప్రతి పదానికి అర్ధం)
I am writing (సరైన క్రమములో పెడితే ఇలా వస్తుంది)
కాలాలు (Tenses)
1. భవిష్యత్ కాలం (Future Tense) (జరుగబోయే పనిని తెలుపుతుంది) (Verb 1)
2. వర్తమాన కాలం (Present Tense) (జరుగుతున్న పనిని తెలుపుతుంది) (Verb 4)
3. భూత కాలం (Past Tense) (జరిగి పోయిన పనిని తెలుపుతుంది) (Verb2)
1. భవిష్యత్ కాలం (Simple Present) (జరుగుతూ ఉన్న పని) (Verb 1)
Subject + Verb 1 + Object
I write. Note Book
నేను వ్రాస్తాను వ్రాత పుస్తకం
(1) (3) (2)
నేను వ్రాత పుస్తకం వ్రాస్తాను
పై వాక్యంలో భవిష్యత్ కాలం అని, ప్రక్కనే Simple Present అని ఉంది. నిజానికి ఇంగ్లీష్ భాష ప్రకారం భవిష్యత్ కాలం అంటే
తప్పకుండా will , shall అనే సహాయక పనులు ఉంటాయి. కాక పోతే ఇంగ్లీష్ భాషలో మూడు కాలాలు ఉండి, ఒక్కో కాలానికి నాలుగు ఉప కాలాలు ఉన్నాయి. తెలుగు భాషలో ఉప కాలాలు లేవు. అందుకే ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, మాట్లాడడం కష్టముగా మారింది.
అందుకోసం తెలుగు భాషలో లాగా ఇంగ్లీష్ భాష ను కూడా మూడు కాలాలుగా మార్చడం జరిగింది, అందుకే పై వాక్యంలో ఉన్న భవిష్యత్ కాలానికి (simple Present ) తీసుకోవడం జరిగింది. Simple Present అంటే తర్వాత జరిగే పనిని తెలుపుతుంది.
తర్వాత జరిగే పని అంటే భవిష్యత్ కాలం లాగా పరిగణించ బడుతుంది. కాబట్టి Simple Present ను భవిష్యత్ కాలం కోసం తీసుకున్నాము.
గమనించ గలరు.
2. వర్తమాన కాలం (Present Tense) (జరుగుతూ ఉన్న పని) (Verb 4)
Subject + Helping Verb. + Verb 4 + Object
I am Writing Note Book
నేను ఉన్నాను వ్రాస్తూ వ్రాత పుస్తకం
(1) (4) (3) (2)
నేను వ్రాత పుస్తకం వ్రాస్తూ ఉన్నాను
వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉన్న పని కాబట్టి Present Continuous తీసుకున్నాము.
3. భూత కాలం (Past Tense) (జరిగిన పని) (Verb 2)
Subject + Verb 2 + Object
I Wrote Note Book
నేను వ్రాసాను వ్రాత పుస్తకం
(1) (3) (2)
నేను వ్రాత పుస్తకం వ్రాసాను
భూత కాలం అంటే జరిగిపోయిన పని కాబట్టి Simple Past తీసుకున్నాం.
పైన తీసుకున్న మూడు కాలాలు తెలుగు భాష యొక్క మూడు కాలాలు అని గమనించగలరు.
తెలుగు భాష లో మూడు కాలాలు మరియు మూడు పని రకాలు ఉంటాయి.
ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే పనులు వేరు , పని రకాలు వేరు.
పనులు చాలా ఉంటాయి. అవి తినడం, త్రాగడం, వ్రాయడం, చదవడం మొదలైనవి.
పని రకాలు మాత్రం మూడే ఉంటాయి అవి : వ్రాస్తాను, వ్రాస్తూ ఉన్నాను, వ్రాసాను.
మూడు కాలాలతో పాటు మూడు పని రకాలు నేర్చుకుంటే చాలు.
i eat అంటే నేను తింటాను అని అర్ధం. నేను తింటాను అన్నప్పుడు కొద్దిసేపటిలో జరుగుతుంది కాబట్టి భవిష్యత్ కాలానికి
తీసుకోవడం జరిగింది.
i am eating అంటే నేను తింటూ ఉన్నాను అని అర్ధం కాబట్టి వర్తమాన కాలానికి తీసుకోవడం జరిగింది.
I ate అంటే నేను తిన్నాను అని అర్ధం కాబట్టి భూత కాలానికి తీసుకోవడం జరిగింది.
ఇలా వేరు వేరు కర్తలతో, వేరు వేరు పని రకాలు మార్చుకుంటూ పోతే అదే భాష.
భవిష్యత్ కాలం :
నేను వ్రాత పుస్తకం వ్రాస్తాను
I note book write (ప్రతి పదానికి అర్ధం )
I write note book (సరియైన క్రమములో పెడితే. ఇలా వస్తుంది )
వర్తమాన కాలం :
నేను వ్రాత పుస్తకం వ్రాస్తూ ఉన్నాను
I note book writing am ( ప్రతి పదానికి అర్ధం)
I am writing note book (సరియైన క్రమం)
భూత కాలం :
నేను వ్రాత పుస్తకం వ్రాసాను
I note book wrote (ప్రతి పదానికి అర్ధం)
I wrote note book (సరియైన క్రమం)
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలుగు తెలిసిన వారికే ఈ పద్దతి అర్ధం అవుతుంది. ఇంగ్లీష్
నేర్చుకోవడం వస్తుంది. ఇది గమనించ గలరు
ఇవి కేవలం సమాధానాలు మాత్రమే, ప్రశ్నలు తయారు చేయడం కూడా
చాలా సులభం. ప్రశ్నల కొరకు చూడండి
Website : Spokenenglisheasynow.blogspot.com
Face book page and group: Spoken English Easy Now
Google+ : Spoken English Easy Now
Instagam : Rudra Venkateshwaru
Twitter : Rudra Venkateshwarlu
For Any doubt send message in Face book
ఇప్పటి వరకు సమాధానాలు చూసాము. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం.
ప్రశ్నలు రెండు రకాలు ఉంటాయి.
1. సహాయక క్రియలతో తయారు చేసే ప్రశ్నలు.
2. ప్రశ్నా పదాలతో తయారు చేసే ప్రశ్నలు.
సహాయక క్రియలతో తయారు చేసే ప్రశ్నలకు అవును లేదా కాదు అనే సమాధానాలు వస్తాయి.
ఉదా:
1. నేను వ్రాస్తానా? (Do I write?)
అవును, మీరు వ్రాస్తారు. (Yes, you write.)
కాదు, మీరు వ్రాయరు. (NO, you do not write.)
2. మీరు వ్రాస్తారా? (Do you write?)
అవును, నేను వ్రాస్తాను. (Yes, I write.)
కాదు, నేను వ్రాయను. (No, I do not write.)
నేను వ్రాయను అంటే నేను వ్రాయడం చేయను అని వస్తుంది.
నేను వ్రాయడం చేయను
I write do not
S V1 H.V + not
1 3 2
I do not write .
(నేను వ్రాయను ని నేను వ్రాయడం చేయను గా వ్రాస్తే I do not write అని వస్తుంది.)
ప్రశ్నా పదాలతో తయారు చేసే ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి.
ఉదా:
1. మీరు ఏమిటి వ్రాస్తారు?
You what write
S Q.W V1
పై వాక్యాలను గమనిస్తే కర్త(S), ప్రశ్నా పదం(Q.W) మరియు క్రియ(V1) వచ్చాయి కానీ సహాయక క్రియ(H.V) రాలేదు. సహాయక క్రియ లేకుండా ప్రశ్న తయారు చేయలేము.
సహాయక క్రియ కొరకు మీరు ఏమిటి వ్రాస్తారు ని
మీరు ఏమిటి వ్రాయడం చేస్తారు గా మార్చాలి.
మీరు ఏమిటి వ్రాయడం చేస్తారు?
you what write do
S Q.W V1 H.V
3 1 4 2
What do you write? అని ఇంగ్లీష్ లో అంటారు.
సహాయక క్రియలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
నేను వ్రాస్తాను
నేను వ్రాయడం చేస్తాను అని అర్ధం వస్తుంది
I write do
S V1 H.V
1 3 2
I do write సరియైన క్రమము
కానీ ఇంగ్లీష్ భాషలో పై వాక్యాన్ని Simple Present లో తీసుకుంటారు
కాబట్టి do అనే సహాయక క్రియ ఉండదు. ఈ క్రింది వాక్యము లాగా ఉంటుంది.
I write
( ఎందుకంటే Simple Present లో వాక్యములో కర్త మరియు క్రియ మాత్రమే ఉంటాయి.)
నేను వ్రాస్తాను అంటే సమాధానం. ప్రశ్న అడగాలి అంటే నేను వ్రాస్తానా?
అని వస్తుంది.
ఇక్కడ ఒక విషయం గమనించవలసినది ఏమిటంటే
do = చేయడం అని అర్ధం
కానీ ఎప్పుడైతే కర్త జతగా వచ్చి చేరుతాడో అప్పుడు అర్ధం క్రింది విధంగా మారిపోతుంది.
I do = నేను చేస్తాను
నేను వ్రాస్తానా? అనేది ప్రశ్న క్రింది దానిలాగా మారుతుంది
నేను వ్రాయడం చేస్తానా? అని అర్ధం వస్తుంది.
I write do
S V1 H.V
2 3 1
Do I write? అని ఇంగ్లీషులో అంటారు.
చేస్తాను = do
చేస్తానా = do
కర్త ముందుగా వచ్చి క్రియ గాని లేదా సహాయక క్రియ గాని తర్వాత వస్తే అది సమాధానము అవుతుంది.
సహాయక క్రియ ముందుగా వచ్చి తర్వాత కర్త వస్తే అది ప్రశ్న అవుతుంది.
ముఖ్యముగా గమనించ వలసిన విషయం ఏమిటంటే నేను వ్రాస్తాను అనే వాక్యాన్ని నేను వ్రాయడం చేస్తాను లాగా విడగొడితే గాని ప్రశ్న తయారు చేయలేము. ఇంగ్లీష్ లో Simple Present లో సహాయక క్రియ ఉండదు కాబట్టి నేను వ్రాస్తాను ( I write) అనే అర్ధం వస్తుంది.
*****
నేను వ్రాస్తూ ఉన్నాను
I writing am
S V4 H.V
1 3 2
I am writing.
పై వాక్యం సమాధానం. ఎలాగంటే కర్త ముందు వచ్చి తర్వాత సహాయక క్రియ వచ్చింది. ఇప్పుడు ప్రశ్న చూద్దాం.
నేను వ్రాస్తూ ఉన్నానా?
I writing am
S V4 H.V
Am I writing? అని ఇంగ్లీష్ లో అంటారు.
ఉన్నాను = am
ఉన్నానా = am
*****
did = చేయడం అయిపోయింది అని అర్ధం.
కానీ ఎప్పుడైతే కర్త జతగా వస్తుందో అప్పుడు అర్ధం క్రింది దానిలాగా మారిపోతుంది.
I did = నేను చేసాను. అని అర్ధం.
నేను వ్రాసాను అనేది సమాధానం. దానిని
నేను వ్రాయడం చేసాను గా విడగొట్టాలి.
I write did
S V1 H.V
1 3 2
I did write.
నిజానికి I did write అని రావాలి, కానీ పై వాక్యం Simple Past లో ఉండడం వలన ఈ క్రింది విధంగా వస్తుంది.
నేను వ్రాసాను
I wrote అని ఇంగ్లీష్ లో అంటారు.
S V2
పై వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే కర్త మరియు క్రియ వచ్చాయి, కానీ సహాయక క్రియ రాలేదు. సహాయక క్రియ లేకుండా ప్రశ్న తయారు చేయలేము. I wrote అంటే నేను వ్రాసాను అని అర్ధం.
కాబట్టి నేను వ్రాసాను ని నేను వ్రాయడం చేసాను గా మార్చితే తప్ప ప్రశ్న తయారు చేయలేము.
నేను వ్రాయడం చేసాను అనేది సమాధానం.
ప్రశ్న ఇలా ఉంటుంది - నేను వ్రాయడం చేసానా?
నేను వ్రాయడం చేసానా?
I write did
S V1 H.V
2 3 1
Did I write? అని ఇంగ్లీష్ లో అంటారు.
చేసాను = did
చేసానా = did
ఇప్పటికి వచ్చిన ప్రశ్నలన్నీ సహాయక క్రియ తో తయారు చేయబడిన ప్రశ్నలు.
*****
కర్త (Subject) = మీరు (You)
క్రియ (Verb) = త్రాగడం (Drink)
ఉన్నారు(సహాయక క్రియ) = are (Helping Verb)
Verb1 Verb2 Verb3 Verb4
మీరు త్రాగుతారు త్రాగారు త్రాగి త్రాగుతూ
You drink drank drunk drinking
1. మీరు త్రాగుతారు
You drink
S V1
2. మీరు త్రాగుతూ ఉన్నారు
You drinking are
S V4 H.V
1 3 2
You are drinking
S H.V V4
**
3. మీరు త్రాగారు
You drank
S V2
*****
చేస్తారు = do
చేస్తారా = do
1. మీరు త్రాగుతారా?
మీరు త్రాగడం చేస్తారా?
You drink do
S V1 H.V
2 3 1
Do you drink?
H.V S V1
Ans : అవును, నేను త్రాగుతాను
Yes, I drink
S V1
*****
ఉన్నారు = are
ఉన్నారా = are
2. మీరు త్రాగుతున్నారా?
మీరు త్రాగుతూ ఉన్నారా?
You drinking are
S V4 H.V
2 3 1
Are you drinking?
H.V S V4
Ans : అవును, నేను త్రాగుతున్నాను
అవును, నేను త్రాగుతూ ఉన్నాను
Yes, I drinking am
S V4 H.V
1 3 2
Yes, I am drinking.
*****
చేసారు = did
చేసారా = did
3. మీరు త్రాగారా?
మీరు త్రాగడం చేసారా?
You drink did
S V1 H.V
2 3 1
Did you drink?
H.V S V1
Ans: అవును, నేను త్రాగాను
Yes, I drank
S V2
*****
చేస్తారు = do
చేయరా = donot
1. మీరు త్రాగరా?
మీరు త్రాగడం చేయరా?
You drink donot
S V1 H.V+not
2 3 1
Donot you drink?
Ans: కాదు, నేను త్రాగను.
కాదు, నేను త్రాగడం చేయను.
No, I drink donot
S V1 H.V+not
1 3 2
No, I donot drink.
2. మీరు త్రాగుతలేరా?
మీరు త్రాగుతూ లేరా?
You drinking arenot
S V4 H.V+not
2 3 1
Arenot you drink?
H.V+not S V1
Ans: కాదు, నేను త్రాగుతలెను.
కాదు, నేను త్రాగుతూ లేను
No, I drinking amnot
S V4 H.V+not
*****
3. మీరు త్రాగలేదా?
మీరు త్రాగడం చేయలేదా?
You drink didnot
S V1 H.V+not
2 3 1
Didnot you drink?
H.V+not S V1
Ans: కాదు, నేను త్రాగలేదు.
కాదు, నేను త్రాగడం చేయలేదు.
No, I drink didnot
S V1 H.V+not
1 3 2
No, I didnot drink.
S H.V+not V1
*****
1. మీరు ఏమిటి త్రాగుతారు?
మీరు ఏమిటి త్రాగడం చేస్తారు?
You what drink do
S Q.W V1 H.V
3 1 4 2
What do you drink?
Q.W H.V S V1
Ans: నేను నీరు త్రాగుతాను.
I water drink
S O V1
1 3 2
I drink water.
S V1 O
*****
2. మీరు ఏమిటి త్రాగుతున్నారు?
మీరు ఏమిటి త్రాగుతూ ఉన్నారు?
You what drinking are
S Q.W V4 H.V
3 1 4 2
What are you drinking?
Q.W H.V S V4
Ans: నేను నీరు త్రాగుతున్నాను.
నేను నీరు త్రాగుతూ ఉన్నాను.
I water drinking am
S O V4 H.V
1 4 3 2
I am driniking water.
S H.V V4 O
*****
3. మీరు ఏమిటి త్రాగారు?
మీరు ఏమిటి త్రాగడం చేసారు?
You what drink did
S Q.W V1 H.V
3 1 4 2
What did you drink?
Ans: నేను నీరు త్రాగాను.
I water drank
S O V2
1 3 2
I drank water.
S V1 O
*****
1. మీరు ఏమిటి త్రాగరు?
మీరు ఏమిటి త్రాగడం చేయరు?
You what drink donot
S Q.W V1 H.V+not
3 1 4 2
What donot you drink?
Q.W H.V+not S V1
Ans: నేను నీరు త్రాగను.
నేను నీరు త్రాగడం చేయను.
I water drink donot
S O V1 H.V+not
1 4 3 2
I donot drink water
S H.V+not V1 O
*****
2. మీరు ఏమిటి త్రాగుతలేరు?
మీరు ఏమిటి త్రాగుతూ లేరు?
You what drinking arenot
S Q.W V4 H.V+not
3 1 4 2
What arenot you drinking?
Ans: నేను నీరు త్రాగుతలెను.
నేను నీరు త్రాగుతూ లేను.
I water drinking amnot
S O V4 H.V+not
I amnot drinking water.
S H.V+not V4 O
*****
3. మీరు ఏమిటి త్రాగలేదు?
మీరు ఏమిటి త్రాగడం చేయలేదు?
You what drink didnot
S Q.W V1 H.V+not
3 1 4 2
What didnot you drink?
Ans: నేను నీరు త్రాగలేదు.
నేను నీరు త్రాగడం చేయలేదు.
I water drink didnot
S O V1 H.V+not
1 4 3 2
I didnot drink water.
S H.V+not V1 O
Rudra. Venkateshwarlu
Spoken English Teacher,
Nalgonda,
Telangana.