Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ఇంటి దగ్గర ఉండి ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకోండి సులభంగా.

మొదట ప్రతిరోజు మాట్లాడే పదాల అర్థాలు నేర్చుకోండి.

i = నేను,

we = మేము,

you = నీవు, మీరు,

he = అతను,

she = ఆమె,

it = ఇది,

they = వారు,


ఇలా అర్ధాలు ఉంటాయి.

eat = తినడం

drink = త్రాగడం,

play = ఆడడం,

walk = నడవడం,

talk = మాట్లాడడం,

call = పిలవడం,

jump = ఎగరడం.


ఇలా అర్దాలు ఉంటాయి.

water = నీరు,

food = అన్నం,

ball = బంతి

house  = ఇల్లు


ఇలాగ ప్రతి పదానికి అర్ధం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది.

ఇది మొదటిది.



పైన గమనించవలసింది ఏమిటంటే


i, we, you = ఇవన్నీ  కర్తలు (subjects) అంటారు.

eat, drink, play = క్రియలు (verbs) అంటారు

food, water, ball = కర్మలు (objects) అంటారు.


కర్తలు, క్రియలు, కర్మలు (subjects, verbs, objects) ఏంటని కంగారు పడవద్దు.
చాలా సులభం.

పని చేసే వాడు కర్త.

పని చేసేది క్రియ (ఏమి పని చేస్తున్నావో అది క్రియ)

పని చేయ బడేది కర్మ ( ఏదైతే కర్తతో చేయబడుతుందో అదే కర్మ)

ఇంకా సులభంగా కింద చూడండి.


i = నేను

eat = తినడం

food = అన్నం

ఇక్కడ        i       eat          food      అంటే
                నేను   అన్నం   తింటాను.

పైన గమనించవలసింది ఏమిటంటే ఇంగ్లీష్ కు తెలుగు కు కొంచం తేడా ఉంటుంది.

ఇంగ్లీష్ లో  Subject   Verb.   Object
                     కర్త           క్రియ        కర్మ
ఇలా వాక్యం ఉంటుంది.


తెలుగు లో    Subject   Object.   Verb
                        కర్త.          కర్మ.        క్రియ
ఇలా వాక్యం ఉంటుంది.


పై వాక్యాలలో క్రియ కర్మ లు మాత్రమే స్థానాలు మాత్రమే మారుతున్నాయి అని గమనించండి.




తెలుగులో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకోండి ఈజిగా,


రెండవది ఏమిటంటే,

Verb Forms అంటే క్రియల రూపాలు 4 రకాలు ఉంటాయి.  ఇవి చాలా ముఖ్యం.
వీటి  ద్వారానే మాట్లాడడం వస్తుంది.

eat.            ate.            eaten.          eating
తినడం     తిన్నాను.     తినేసాను.       తింటూ

drink.       drank.         drunk.     drinking
త్రాగడం     త్రాగాను      త్రాగేసాను.  త్రాగుతూ


ఇలా చాలా verb forms  నేర్చుకోవాలి.

చాలా మందికి verb forms వచ్చు కానీ meaning అంటే అర్ధాలు తెలియవు.  అర్ధాలు తెలియ కుంటే ఇంగ్లీష్ రాదు.







మూడవది  Helping Verbs. అంటే సహాయక క్రియలు.   ఇవి మొత్తం 21 ఉంటాయి. అన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి.


కానీ Tenses అంటే కాలాలలో  కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి అవి ఇప్పుడు నేర్చుకుందాం.


do = చేయడం

am = ఉన్నాను

is = ఉన్నాడు, ఉన్నది

are = ఉన్నారు, ఉన్నాయి

have = కలిగి ఉండడం.

has = కలిగి ఉండడం

did = చేసాను

was = ఉండెను

were = ఉండిరి

had = కలిగి ఉండెను

shall = గలను

will = గలను

may. =

might =

should =

would =




మిగతా వాటికి చూస్తూనే ఉండండి.