I drink milk everyday
నేను త్రాగుతాను పాలు ప్రతిరోజు
1 4 3 2
నేను ప్రతిరోజు పాలు త్రాగుతాను
పై ఇంగ్లిష్ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే I అనేది ఇంగ్లీషు వాక్యానికి ముందుగా వచ్చింది. I అంటే కర్త (ఇంగ్లీష్ లో Subject ) ఆని అంటారు. ఒక ఇంగ్లీష్ వాక్యంలో కర్త ( Subject ) ఎప్పుడైతే ముందు వస్తుందో అప్పుడు ఈ కర్త ని ముందు చదివి మిగతా వాక్యాన్ని చివర నుండి మొదటికి చదవాలి. అప్పుడే వాక్యం సులభముగా అర్ధమవుతుంది.
ఆంగ్లములో ఉన్న వాక్యాన్ని తెలుగులో అర్ధం చేసుకోవడానికి ఇదే ఇక్కడ ఉన్న రహస్యం.
Drink more water for get health
త్రాగండి ఎక్కువ నీరు కొరకు పొందడం ఆరోగ్యం
5 4 3 2 1
ఆరోగ్యం పొందడం కొరకు ఎక్కువ నీరు త్రాగండి.
పై ఇంగ్లీష్ వాక్యాన్ని గమనించితే Drink అనే పదం వాక్యానికి ముందుగా ఉంది. Drink అనే పదాన్ని తెలుగులో క్రియ ( ఆంగ్లములో Verb ) ఆని అంటారు. ఏ ఇంగ్లిష్ వాక్యంలో అయితే క్రియ ( Verb ) ముందుగా వస్తుందో ఆ వాక్యాన్ని చివర నుండి మొదటికి చదవాలి. అప్పుడే ఆ ఇంగ్లీష్ వాక్యం తెలుగు లో అర్ధం అవుతుంది.
How to understand a English sentence in Telugu?
ఎలా కి అర్ధం చేసుకోవడం ఒక ఇంగ్లీష్ వాక్యం లో తెలుగు
4 3 2 1
తెలుగులో ఇంగ్లీష్ వాక్యాన్ని అర్ధం చేసుకోవడం ఎలా?
పై ఇంగ్లీష్ వాక్యాన్ని కూడా గమనించితే How అనే పదం వాక్యానికి ముందుగా వచ్చింది
అంటే ఇది ప్రశ్నా పదం ( ఇంగ్లీష్ లో Question word ) అని అంటారు. నిజానికి ప్రశ్న అన్నప్పుడు
ఇంగ్లీష్ వాక్యంలో ప్రశ్న పదం ( Question word ) తర్వాత సహాయక క్రియ (Helping Verb ) ఉండాలి.
కానీ పై వాక్యంలో Helping Verb లేదు. ( is, are, do, did లాంటివి ) Helping Verbs లేనప్పుడు Question word తో ఉన్న వాక్యాన్ని చివర నుండి మొదటికి చదవాలి.