డోర్ మూయి. (Dore mooyi)
Close door.
ఎందుకు? (Endhuku?)
Why?
గాలి లోపలికి వస్తుంది. (Gaali lopaliki vasthundhi)
Air is coming inside.
గాలి వస్తుందా లేక వర్షం పడుతుందా? (Gaali vasthundhaa Leka varsham paduthundhaa?)
Is air coming or rain falling?
వర్షం పడట్లేదు. గాలి మాత్రమే వస్తుంది. (Varsham padatledhu. Gaali maathrame vasthundhi)
Rain is not falling. Only air is coming.
బయట బట్టలు ఉన్నాయి. నువ్వు బట్టలు తెచ్చావా? (Bayata battalu unnaayi. Nuvvu battalu thechchaavaa?)
Dresses are outside. Did you bring dresses?
లేదు, నేను బట్టలు తేలేదు. (Ledhu, nenu battalu theledhu)
No, i did not bring dresses.
త్వరగా బట్టలు తీసుకొని రా. (Thvaragaa battalu theesukoni theesukoni raa)
Bring dresses fastly.
సరే, నువ్వు కూడా రావచ్చుగా. (Sare, nuvvu koodaa raavachchugaa)
Ok, you also may come na.
నేను రాను. నువ్వు, వెళ్ళు (nenu raanu. Nuvvu, vellu)
I will not come. You, go.
నేను వెళతాను. కిచెన్ లో పాలు చూడు. (Nenu velathaanu. Kitchen lo paalu choodu)
I will go. See milk in kitchen.
సరే, నేను కిచెన్ లోకి వెళతాను. (Sare, nenu kitchen loki velathaanu)
Ok, i will go into kitchen.
మీ అమ్మాయి ఈ బొమ్మ గీసిందా? (Mee ammaayi ee bomma geesindhaa?)
Did your daughter draw this picture?
అవును, మా అమ్మాయి ఈ బొమ్మ గీసింది. (Avunu, maa ammaayi ee bomma geesindhi)
Yes, my daughter drew this picture.
మీ అమ్మాయి ఈ బొమ్మని బాగా గీసింది. (Mee ammaayi ee bommani baagaa geesindhi)
Your daughter drew this picture good.
కృతజ్ఞతలు. (Kruthagnathalu)
Thanks.
మీ అమ్మాయి ఎప్పుడు డ్రాయింగ్ నేర్చుకుంది? (Mee ammaayi eppudu drawing nerchukundhi?
When did your daughter learn drawing?
మా అమ్మాయి రెండు సంవత్సరాల నుండి నేర్చుకుంటుంది. (Maa ammaayi rendu samvatsaraala nundi nerchukuntundhi)
My daughter is learning since two years.
మీరు మీ అమ్మాయిని మంచిగా ప్రోత్సహించారు. (Meeru mee ammaayi manchigaa protchahinchaaru)
You encouraged your daughter good.
అవును, నేను డ్రాయింగ్ నేర్చుకుంటాను అని మా అమ్మాయి అడిగింది అందుకే ప్రోత్సహించాము. (Avunu, nenu drawing nerchukuntaanu ani maa ammaayi adigindhi andhuke protchahinchaaru.)
Yes, my daughter asked, i will learn drawing hence encouraged.
ప్రతి తల్లిదండ్రులు ఇలా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాలి. (Prathi thallidhandrulu ilaa vaalla pillalni protchahinchaali)
Every parents should encourage their children like this.