Where is this address?
చక్కగా వెళ్ళి, ఎడమ వైపు తిరగండి. (Chakkagaa velli, edama vaipu thiragandi)
Go straight and turn left.
ఎంత దూరం? (Entha dhooram?)
How much distance?
హాఫ్ కిలోమీటర్ దూరం ఉంది. ఆటో లో వెళితే, తొందరగా వెళ్ళవచ్చు. (Half kilo meter dhooram undhi. Auto lo velithe thondharagaa vellavachchu)
It is half kilo meter distance. If you will go in auto, you may go fastly.
నా ఫ్రెండ్ వస్తున్నాడు. అతని బైక్ మీద వెళతాను. థాంక్స్. (Naa friend vasthunnaadu. Athani bike meedha velathaanu. Thanks.)
My friend is coming. I will go on his bike. Thanks.
యు ఆర్ వెల్కమ్.
You are welcome.
ఇదే అడ్రస్. (Idhe address)
This is address.
నువ్వు, లోపలికి వెళ్ళు. నేను బయట ఉంటాను. (Nuvvu, lopaliki vellu. Nenu bayata untaanu)
You, go inside. I will stay outside.
ఇక్కడే ఉండు. నేను వెంటనే వస్తాను. (Ikkade undu. Nenu ventane vasthaanu)
Stay here. I will come immediately.
అన్నీ కనుక్కొని రా. ఏదీ మిస్ చేయకు. (Annee kanukkoni raa. Edhee miss cheyaku)
Ask all and come. Don't miss anything.
సరే, అన్నీ కనుక్కుంటాను. (Sare, annee kanukkuntaanu)
Ok, I will ask all.
మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? (Manam ippudu ekkadiki vellaali?)
Where should we go now?
అక్క ఫోన్ కాల్ చేసింది కదా. అక్క ఎక్కడుందో అడుగు. అక్కడికి వెళ్ళాలి. (Akka phone call chesindhi kadhaa. Akka ekkadundho adugu. Akkadiki vellaali)
Elder sister did phone call na. Ask, where elder sister is. We should go there.
నీ ఫోన్ ఇవ్వు. (Nee phone ivvu)
Give your phone.
తీసుకో. (Theesuko)
Take.
ఫోన్ రింగ్ అవుతుంది. (Phone ring avuthundhi)
Phone is ringing.
అక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. (Akka phone lift cheyatledhu)
Elder sister is not lifting phone.
మళ్ళీ ట్రై చేయి. (Mallee try cheyi)
Try again.
హలో అక్క, నువ్వు ఎక్కడున్నావు? (Hello akka, nuvvu ekkada unnaavu?
Hello sister, where are you?
నేను ఆఫీస్ లో ఉన్నాను. (Nenu office lo unnaanu)
I am in office.
మేము వస్తున్నాము. అక్కడే ఉండు. (Memu vasthunnaamu. Akkade undu)
We are coming. Stay there.
నేను ఆఫీస్ లోనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను.(nenu office lone untaanu. Nenu ekkadiki vellanu)
I will stay in office. I will not go anywhere.