Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 52

స్పోకెన్ ఇంగ్లీష్ -52

 

ఎవరూ చెప్పలేదు.

Anybody did not tell.


ఎవరూ చెప్పకుండా మీకు ఎలా తెలిసింది?

How did you know without telling anyone?


నేను అనుకున్నాను

I did think


మీరు ఎలా అలా అనుకున్నారు?

How did you think like that?


నేను కొన్నిసార్లు అలా అనుకుంటాను

I will think sometimes like that


మనం నోరు తెరవడానికి ముందు హృదయాన్ని తెరవాలి

We should open heart before open mouth


విజయం మీ దగ్గరకు రాదు, మీరు దాని దగ్గరికి వెళ్లాలి.

Success will not come near you, you should go near that.


ఎవరైనా చెబితే, మీరు వింటారా?

If anyone will tell, will you listen?


ఎవరైనా చెబితే, మీరు వినకూడదు.

If anyone will tell, you should not listen.


నువ్వు నా ఆత్మ సహచరుడివి

You are my soul mate


ఎప్పుడూ సంతోషంగా ఉండు

Be happy always


సంతోషం మనకు సగం బలం

Happiness is half strength to us


బిగ్గరగా పిలవండి

Call loudly


అతను నెమ్మదిగా ఎందుకు పిలుస్తున్నాడు?

Why is he calling slowly?


మీరు నెమ్మదిగా పిలిస్తే, అతను వినడు.

If you will call slowly, he will not listen.


మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తిని ప్రేమించండి.

Love opposite person how you are loving you.


సంకోచించకండి.

Feel free.


మా అమ్మ చెప్పింది. మీరు, మీతో సంతోషంగా ఉండండని.

My mother told. You, be happy with you.


ఏదీ రాదు.

Anything will not come


మనం ఎలా ఆలోచిస్తామో, మనం అలా పొందుతాము.

How we will think, we will get like that.


మనం ఎలా ఆలోచిస్తామో, అలా జరుగుతది.

How we will think, happens like that.


మర్యాదగా మాట్లాడండి. కఠినంగా మాట్లాడకండి.

Talk politely. Don’t talk harshly.


మాట్లాడే ముందు ఆలోచించండి.

Think before speak.


మీరు ఆలోచిస్తే, మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుస్తది.

If you will think, you will know what you are talking


మీకు భాష గురించి తెలుసా?

Did you know about language?


మీకు తెలిసిఉంటే, చెప్పండి.

If you did know, tell.


నేను శారీరకంగా పేదవాడిని కానీ లోపల నేను పేదవాడిని కాదు. ఎందుకు అంటే, నాకు టాలెంట్ ఉంది.

I am poor physically but I am not poor inside. Why means, I did have talent.


ప్రతిభ అనేది ఏ వ్యక్తి సొంతం కాదు.

Talent is not any person own.


దేవుడు నీవు అడిగే ప్రతిదాన్ని ఇస్తాడు కానీ నీ అవసరం కోసం నువ్వు అడగాలి. అనవసరంగా అడగవద్దు.

God will give everything what you will ask but you should ask for your need. Don’t ask for 

unnecessarily.


మీకు మంచి హృదయం ఉంటే, మీరు మంచిని పొందుతారు.

If you will have good heart, you will get good.


మీకు చెడు హృదయం ఉంటే, ఆ చెడ్డ హృదయం మీ జీవితాన్ని పాడు చేస్తది.

If you will have bad heart, that bad heart will spoil your life.


మంచిగా ఉండండి మరియు మంచి చేయండి. ఎందుకు అంటే, ఆత్మ ఉన్న చోట దేవుడు ఉన్నాడు.

Be good and do good. Why means, Where soul is there is God.


దేవుడు ప్రతి మనిషిలోనూ ఉన్నాడు.

God is in every human being.


మంచి చేయడానికి ముందు ఉండండి. చెడు చేయడానికి చివర ఉండండి.

Be first to do good. Be last to do bad.


మనం జీవించగలిగే గ్రహం మరొకటి లేదు.

There is no other planet where we can live.


జీవించడానికి మరొక గ్రహం లేదు.

There is no another planet to live.


మానవుడు జీవించడానికి భూమి ఒకే ఒక గ్రహం.

Earth is only one planet to live human being.


మీరు మంచి చేస్తే, మీరు మంచిని పొందుతారు.

If you will do good, you will get good.


మీరు చెడు చేస్తే, మీరు చెడుని పొందుతారు.

If you will do bad, you will get bad.


మేము బంతిని పైకి విసిరితే, ఆ బంతి క్రిందికి వస్తుంది. అదే విధంగా, మీరు ప్రతిదీ పొందుతారు.

If we will through ball upside, that ball will come downside. Same way, you will get everything.


మనస్సు అన్నీటికి కారణం. మీరు ఎలా ఆలోచిస్తారో, మీరు ఆ విధంగా పొందుతారు.

Mind is reason to all. How you will think, you will get that way


ఇలా

Like this


అలా

Like that.


ఈ విధంగా (ఈ వైపు)

This way


ఆ విధముగా (ఆ వైపు)

That way


దారి లేదు.

No way.


మా అసభ్య ప్రవర్తన కారణంగా అన్ని మార్గాలు మూసుకుపోయాయి.

All ways were closed due to our misbehavior.


కాబట్టి, జాగ్రత్తగా ఉండండి

So, be careful


మంచి గురించి ఆలోచించండి. చెడు గురించి ఆలోచించకండి.

Think about good. Don’t think about bad.


ఈ పని చేయడానికి ఏ ఒక్కరు తగినవారు కాదు.

Anyone person is not suitable to do this work.


మంచి వ్యక్తి ఇలా చేయాలి అప్పుడు అంతా బాగుంటది.

Good person should do this then everything will be good.


ప్రతి వ్యక్తి మంచి విషయాలు చెప్పగలడు కానీ కొంతమంది వ్యక్తులు అలా చేయగలరు.

Every person can tell good matters but some persons can do like that.