Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English Level 6

ఇప్పడు Past Continuous నేర్చుకుందాం
past continuous అంటే గతములో ఏదైతే పని జరుగుతూ ఉండినదో  దాని గురించి తెలియజేస్తుంది.

Subject + Helping Verb + Verb4 + Object
 
Subject  మనం నేర్చుకున్నాం
Helping Verb -   was, were లు  ఉంటాయి
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం


was, were   Helping Verbs Subject ని బట్టి మారుతుంటాయి.

was - I, He, she, it      ఒక్కరి గురించి చెప్పినప్పుడు వస్తుంది
were - we, you, they   ఒకరికంటే ఎక్కువ మంది గురించి చెప్పినప్పుడు  వస్తుంది


was = ఉండెను
were = ఉండిరి



Subject + Helping Verb + Verb4 + Object
     I                was                 eating     food
   నేను            ఉండెను           తింటూ        అన్నం
     1                  4                      3                2

  నేను  అన్నం  తింటూ ఉండెను
 
 నేను అన్నం తింటుండేను








Subject + Helping Verb + Verb4 + Object
     I                was               drinking    water
   నేను            ఉండెను           త్రాగుతూ     నీళ్లు
     1                  4                      3                2

  నేను  నీళ్లు త్రాగుతూ  ఉండెను

 నేను నీళ్లు త్రాగుతుండేను



ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం

నేను అన్నం తింటుండేను

నేను  అన్నం  తింటూ   ఉండెను
 I       food   eating    was
1          4         3            2

I   was   eating   food
S   HV       V4        O


నేను అన్నం తింటుండేను ని  నేను అన్నం తింటూ ఉండెను గా Helping Verb కొరకు విడదీయాలి

నేను నీళ్లు త్రాగుతుండెను
నేను   నీళ్లు      త్రాగుతూ   ఉండెను
 I       water   drinking    was
1          4             3             2

I    was    drinking  water
S    HV        V4           O



ఇక్కడ చేయవలసినది  తెలుగులో సరిగా అనుకుంటే ఇంగ్లీషులో కి
మార్చడం చాలా సులభం. ఎలాగంటే క్రింద గమనించండి.


నేను అన్నం తింటున్నాను

నేను అన్నం తింటూ ఉన్నాను
 I     food    eating.  am
1       4           3          2

I    am   eating    food
S   HV      V4         O






నేను అన్నం తింటుండేను

నేను  అన్నం  తింటూ   ఉండెను
 I       food   eating    was
1          4         3            2

I   was   eating   food
S   HV       V4        O



పై రెండు వాక్యాలను గమనిస్తే
నేను అన్నం తింటున్నాను    Present Continuous
నేను అన్నం తింటుండేను    Past Continuous

నేను అన్నం తింటున్నాను   అంటే
నేను అన్నం తింటూ  ఉన్నాను   అని అర్ధం

నేను అన్నం తింటుండేను   అంటే
నేను అన్నం తింటూ ఉండెను   అని అర్ధం

పై రెండు వాక్యాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే
కేవలం చివరి పదాలు మాత్రమే మారాయి.
అంటే ఉన్నాను, ఉండెను ఈ రెండు మాత్రమే మారాయి
మిగతావన్నీ  అలాగే ఉన్నాయి.
ఈ రెండు Helping Verbs.
మనం చెప్పేది ప్రస్తుతం జరుగుతున్న పని గురించా లేక
గతములో జరుగుతున్న పని గురించా అనేది గమనించి

ప్రస్తుతం జరుగుతున్న పని అయితే Present Conitnuous లో
చెప్పాలి.
గతములో జరుగుతున్న పని గురించి అయితే Past Continuous లో
చెప్పాలి.  ఇంతే చాలా సులభం.





Spoken English Levels 


Spoken English Level 1 Click Here

Spoken English Level 2 Click Here

Spoken English Level 3 Click Here

Spoken English Level 4 Click Here

Spoken English Level 5 Click Here



Spoken English Level 7 Click Here

Spoken English Level 8 Click Here

Spoken English Level 9  Click Here

Spoken English Level 10   Click Here

Spoken English Level 11   Click Here

Spoken English Level 12   Click Here