Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 41

Spoken English without grammar.

Spoken English with meanings.


మాట్లాడకు 

Don't talk


వాళ్ళని మాట్లాడనివ్వండి 

Let them talk 


వాళ్ళని మాట్లాడనివ్వకండి 

Don't let them talk


వాళ్ళు ఎవరు?

Who are they?


వారు ఏం మాట్లాడుతున్నారు?

What are they talking?


వారు అడ్రస్ అడుగుతున్నారు.

They are asking address.


ఎవరి అడ్రస్ కావాలంట? (ఎవరి అడ్రస్ అడుగుతున్నారు?)

Whose address are they asking?


నారాయణ గారి ఇంటి అడ్రస్ అడుగుతున్నారు.

They are asking Narayana gaari home address?


నువ్వు చెప్పావా?

Did you tell?


నేను చెప్పాను. 

I did tell.


లోపలకు రా. 

Come inside


అన్నం వండావా?

Did you cook rice?


లేదు, అన్నం వండలేదు 

No, I did not cook rice.


అన్నం ఎప్పుడు వండుతావు?

When will you cook rice?


ఐదు నిమిషాలలో అన్నం వండుతాను.

I will cook rice in five minutes.


ఇంట్లో కూరగాయలు ఉన్నాయా?

Are vegetables in home?


ఇంట్లో కూరగాయలు ఉన్నాయి.

Vegetables are in home.


త్వరగా వండు. తిని బయటకి వెళ్ళాలి.

Cook fastly. I should eat and go outside.


నీకు బయట ఏం పని ఉంది?

Which work did you have outside?


నాకు బయట చాలా పనులు ఉన్నాయి.

I had many works outside.


నేను నీతో వస్తాను. నేను నీతో రావచ్చా?

I will come with you. May i come with you?


నువ్వు నాతో వచ్చి ఏం చేస్తావు?

You will come with me. What will you do?


నేను షాపింగ్ చేయాలి.

I should do shopping.


నువ్వు మొన్ననే షాపింగ్ చేసావు కదా.

You did shopping day before yesterday na.


నేను మళ్ళీ షాపింగ్ చేస్తాను.

I will do shopping again.


నీ దగ్గర డబ్బులు ఉన్నాయా?

Did you have money?


నీ జేబులో నుండి తీసుకున్నాను.

I did take from your pocket.


అవి నా డబ్బులు. నువ్వు ఎందుకు తీసుకున్నావు?

Those are my money. Why did you take?


నేను షాపింగ్ చేయాలి అందుకే  తీసుకున్నాను.

I should do shopping hence I did take.


నువ్వు నా డబ్బులు తిరిగి ఇవ్వాలి. 

You should give back my money.


నేను తిరిగి ఇవ్వను. 

I will not give back.


నీకు డబ్బులు కావాలంటే, నాన్నను అడుగు.

If you will want money, ask father.


నేను డబ్బులు అడగాలా? నువ్వే అడిగి ఇవ్వు.

Should I ask money? You, ask and give.


తర్వాత ఇస్తాను. 

I will give after.